ఫిబ్రవరి 23 ఎకో టూరిజం ఈవెంట్లు

ఫిబ్రవరి 23 ఎకో టూరిజం ఈవెంట్లు

గచ్చిబౌలి, వెలుగు: ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు, ప్రజల్లో అడవులు, జంతువులు, పక్షుల అవసరాన్ని వివరిస్తూ ‘డెక్కన్ వుండ్స్ & ట్రయిల్స్’ పేరుతో ప్రతి శని, ఆదివారాల్లో స్పెషల్​ఈవెంట్లు నిర్వహించనున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. ఈ నెల 22 నుంచి మార్చి 30 వరకు ప్రతీ వీకెండ్ ఎకో టూరిజం ఈవెంట్లు ఉంటాయన్నారు.

22న ఉదయం ఫారెస్ట్ ట్రెక్ పార్కులో ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్, 23న ఉదయం వికారాబాద్ అనంతగిరి హిల్స్ లో బర్డ్ వాక్, మార్చి 1న ఫారెస్ట్ ట్రెక్ పార్కులో మధ్యాహ్నం 3 నుంచి మరుసటి రోజు ఉదయం 10 వరకు నేచర్ క్యాంప్, మార్చి 2న గజ్వేల్ ఫారెస్ట్ లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు బర్డ్ వాక్ ఉంటుందన్నారు.

8న మధ్యాహ్నం ఫారెస్ట్ ట్రెక్ పార్కులో మధ్యాహ్నం 3 నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నేచర్ క్యాంప్, 9న ఉదయం ఫారెస్ట్ ట్రెక్ పార్కులో బర్డ్ వాక్,15న మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 వరకు నేచర్ క్యాంప్ ఉంటుందన్నారు. 16న ఉదయం ఫారెస్ట్ ట్రెక్ పార్కులో ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్, 22న ఫారెస్ట్ ట్రెక్ మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నేచర్ క్యాంప్, 23న అనంతగిరి హిల్స్ లో ఉదయం 7 గంటల నుంచి 10 వరకు బర్డ్ వాక్, ట్రెక్కింగ్, 29న ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 వరకు నేచర్ క్యాంప్, 30న గజ్వేల్ ఫారెస్ట్ లో ఉదయం 7 నుంచి10 గంటల వరకు బర్డ్ వాక్ ఉంటాయన్నారు. ఆసక్తిగల వారు 94935 49399, 93463 64583 నంబర్లలో సంప్రదించాలని కోరారు.